News April 10, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞ నంద్యాలలో డ్రగ్స్ అధికారుల మెరుపు దాడులు ☞ శిరివెళ్ల హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్ ☞ పంచలింగాల చెక్పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం ☞ GREAT❤️.. నేటి సమాజానికి అతనో ఆదర్శం! ☞ జిల్లా నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం ☞ మత్తు పదార్థాలను నియంత్రించాలి: ఏఎస్పీ ☞ నంద్యాలలో మెగా జాబ్ మేళా ప్రారంభించిన మంత్రి ఫరూక్ ☞ కలెక్టర్ను కలిసిన ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ☞ రేవనూరులో ఘనంగా ఉరుసు వేడుకలు
Similar News
News December 2, 2025
హైదరాబాద్లో తొలి IFAS టెక్నాలజీ!

HYDలో తొలిసారిగా అధునాతన IFAS (ఇంటిగ్రేటెడ్ ఫిక్స్డ్-ఫిల్మ్ యాక్టివేటెడ్ స్లడ్జ్) టెక్నాలజీతో కూడిన మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) రానుంది. HMDA ఆధ్వర్యంలో తొర్రూర్ లేఅవుట్లో రూ.5.90కోట్ల అంచనా వ్యయంతో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. 2.3 MLD సామర్థ్యం గల ఈ ప్లాంట్ కేవలం 0.43 ఎకరాల పరిమిత స్థలంలోనే నైట్రోజన్, ఫాస్ఫరస్లను సమర్థవంతంగా తొలగించనుంది. ఏడాదిలో ఈ ప్రాజెక్టు పూర్తికానుంది.
News December 2, 2025
నెల్లూరు ‘నేర‘జాణలు వీళ్లు.!

నెల్లూరులో ‘నేర‘జాణల హవా ఎక్కువైంది. మొన్నటి వరకు నిడిగుంట అరుణ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. తాజాగా పెంచలయ్య హత్యతో అరవ కామాక్షి వెలుగులోకి వచ్చింది. కొందరు యువకులతో గ్యాంగ్ నడిపిస్తూ గంజాయి వ్యాపారం చేస్తోంది. తనకు అడ్డు వచ్చి వారిని ఇదే గ్యాంగ్తో బెదిరిస్తోంది. ఈక్రమంలోనే పెంచలయ్యను కామాక్షి హత్య చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి లేడీ డాన్లను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.
News December 2, 2025
‘PM ఆవాస్ యోజన-NTR’ పథకానికి దరఖాస్తు గడువు పెంపు

AP: నవంబర్ 30తో ముగిసిన PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.


