News April 15, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యంశాలు.!

image

☞ఒంటిమిట్ట వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు నంద్యాల వాసుల మృతి
☞నంద్యాల మున్సిపల్ పార్కులో విద్యార్థి మృతి
☞మహానంది వద్ద వ్యక్తి మృతి.. రంగంలోకి ఫోరెన్సిక్ అధికారులు
☞బనగానపల్లెలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి
☞శ్రీశైలంలో రద్దీ.. ప్రత్యేక దర్శనాల రద్దు
☞జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
☞నంద్యాల రైల్వే స్టేషన్ పరిశీలించిన DRM
☞ రక్తంతో అంబేడ్కర్ చిత్రం.

Similar News

News November 13, 2025

ఖమ్మం: కాస్ట్ లీ బైక్ కనిపిస్తే అంతే..

image

సూర్యాపేట(D) చిలుకూరు (M) కట్టకొమ్ముగూడెంకు చెందిన కృష్ణ, నల్గొండ (D) నకిరేకల్ (M) ఆర్లగడ్డగూడెంకు చెందిన శివకుమార్‌ను SRPT పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేలిముద్రలను తనిఖీ చేయగా కృష్ణపై 150 బైక్ చోరీ కేసులున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా SRPT, KMM, MLG, NLGతో పాటు HYD, APలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా అతని వద్ద KMM వాసులకు చెందిన 6 బైక్‌లు ఉన్నాయి.

News November 13, 2025

ప.గో: వైసీపీలో ఆరుగురికి కీలక పదవులు

image

వైసీపీ రాష్ట్ర కార్యవర్గంలో పలువురిని కార్యదర్శులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. పేరిచర్ల విజయ నరసింహారాజు, ముప్పిడి సంపత్ కుమార్, యడ్ల తాతాజీ, కొట్టు నాగేంద్ర (పశ్చిమగోదావరి ), నూకపెయ్యి సుధీర్ బాబు, డీ వీ ఆర్ కే. చౌదరి (ఏలూరు) నియమితులయ్యారు.

News November 13, 2025

సంగారెడ్డి: టెన్త్‌ ఫీజు గడువు నేడే లాస్ట్.!

image

పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు నేటితో (గురువారం) ముగియనున్నట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇంకా ఫీజు చెల్లించని వారు సాయంత్రంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.