News March 4, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

☞ కొలిమిగుండ్లలో ఆర్టీసి బస్సు బోల్తా ☞ పాణ్యం ఎమ్మెల్యేకు RRR అభినందన ☞ కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి ☞ పాతపాడులో తల్లిదండ్రులు లేని యువతికి ఆర్థిక సాయం ☞ శ్రీశైలం జలాశయం నుంచి 7,345 క్యూసెక్కుల నీటి విడుదల ☞ గుడిపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థి అదృశ్యం ☞ PTC నుంచి పాస్ అవుట్ అయిన జిల్లా SIలు ☞ వేసవిలో తాగునీటి నివారణకు చర్యలు: కలెక్టర్ ☞ బస్సు బోల్తాపై మంత్రులు ఆరా
Similar News
News March 5, 2025
కుంభమేళాలో రూ.30 కోట్లు సంపాదించిన ఫ్యామిలీ: సీఎం

కిడ్నాప్, చోరీ, మర్డర్ లాంటి ఘటనలు జరగకుండా మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తే పలు రంగాలకు రూ.3లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అనేక కుటుంబాలు లాభపడ్డాయని తెలిపారు. ఓ ఫ్యామిలీ 130 బోట్లను నడిపిస్తూ రూ.30కోట్లు సంపాదించిందని పేర్కొన్నారు. రోజుకు ఒక్కో బోటు నుంచి రూ.52వేలు లాభం పొందిందని ఓ సక్సెస్ స్టోరీని వివరించారు.
News March 5, 2025
TTD Update: నేరుగా శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు శ్రీవారి దర్శనం నేరుగా లభిస్తోంది. నిన్న శ్రీవారిని 64,861 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.3.65 కోట్ల ఆదాయం సమకూరింది.
News March 5, 2025
సీసీ కుంట: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలి మృతి

సీసీకుంట మండలం గూడూర్ గ్రామ శివారులో బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. అమరచింత మం. మస్థిపురానికి చెందిన గుండమ్మ(77) కురుమూర్తి స్వామి దర్శనానికి గతనెల 28న వెళ్లింది. ఆలయ పరిసరాల్లో అటుఇటు తచ్చాడుతూ పలువురికి కనిపించింది. ఇంతలోనే బావిలో ఆమె మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.