News March 7, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది: కాటసాని☞ మహిళలకు జిల్లా వరకే ఫ్రీ జర్నీపై భిన్నాభిప్రాయాలు ☞ మార్చిలోనే భగభగలు.. బండి ఆత్మకూరులో 39.5 డిగ్రీలు ☞ డోన్లో ముగ్గురు నాటుసారా విక్రేతల అరెస్ట్ ☞ కేసి కెనాల్ కు కొనసాగుతున్న నీటి విడుదల ☞ 13న నందివర్గంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ☞ బనగానపల్లె శివరామ్ థియేటర్ వద్ద పోలీసు బందోబస్తు ☞ గాలికుంటు టీకాల కార్యక్రమం
Similar News
News November 19, 2025
పెరవలి: కూతురిని గర్భిణిని చేసిన తండ్రి..డీఎస్పీ విచారణ

పెరవలి మండలంలో కన్న కూతురిపై తండ్రి రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడి గర్భిణిని చేసిన విషయం తెలిసిందే. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ జి.దేవకుమార్ గ్రామంలో విచారణ చేపట్టారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.
News November 19, 2025
కాణిపాకం అభివృద్ధికి రూ.25 కోట్లు

కాణిపాకంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ.25 కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్టోబరు 28న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కాణిపాకం ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్సు, సామూహిక వివాహాల కోసం పెద్ద హాళ్లను నిర్మించేందుకు రూ.25కోట్లు ఆర్థిక సాయం అందించాలని తీర్మానం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
News November 19, 2025
HYD: రాహుల్ సిప్లిగంజ్ వివాహం.. సీఎంకి ఆహ్వానం

రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి వివాహానికి నవంబర్ 27న పెద్దలు ముహూర్తం నిశ్చియించారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్యరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించారు.


