News March 7, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది: కాటసాని☞ మహిళలకు జిల్లా వరకే ఫ్రీ జర్నీపై భిన్నాభిప్రాయాలు ☞ మార్చిలోనే భగభగలు.. బండి ఆత్మకూరులో 39.5 డిగ్రీలు ☞ డోన్‌లో ముగ్గురు నాటుసారా విక్రేతల అరెస్ట్ ☞ కేసి కెనాల్ కు కొనసాగుతున్న నీటి విడుదల ☞ 13న నందివర్గంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ☞ బనగానపల్లె శివరామ్ థియేటర్ వద్ద పోలీసు బందోబస్తు ☞ గాలికుంటు టీకాల కార్యక్రమం
Similar News
News March 25, 2025
BSNL యూజర్లకు అలర్ట్

కేవైసీ కంప్లీట్ చేయకపోతే 24 గంటల్లో సిమ్ బ్లాక్ అవుతుందని నోటీసులు వస్తే స్పందించవద్దని యూజర్లకు BSNL సూచించింది. ఇటీవల పలువురు యూజర్లకు ఇలాంటి నోటీసులు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, కానీ తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. స్కామర్లు KYC పేరిట యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపింది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 25, 2025
KMR: జర్నలిస్ట్‌ల అక్రడిటేషన్ కార్డుల గడువు పెంపు

రాష్ట్ర, జిల్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు వ్యవధిని 3 నెలల పాటు పొడిగించినట్లు కొత్త మార్గదర్శకాలతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఐ&పీఆర్ విభాగం వర్కింగ్ జర్నలిస్టులను అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అసౌకర్యాన్ని చెల్లుబాటును మూడు నెలల పాటు పొడిగించారన్నారు.
News March 25, 2025
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అవసరం లేదనిపించింది: ధోనీ

IPLలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రూల్‌ను ప్రకటించినప్పుడు అవసరం లేదని అనిపించింది. టోర్నీ మంచి పొజిషన్‌లోనే ఉంది. TRP కూడా బాగుంది. అలాంటప్పుడు ఇంకా మసాలా యాడ్ చేయడమెందుకు అని అనుకున్నా. ప్రస్తుతం ఈ రూల్ నాకు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే నేను బ్యాటింగ్, కీపింగ్ రెండూ చేస్తున్నా. టోర్నీలో హైస్కోర్లు నమోదవడానికి పిచ్ పరిస్థితులే కారణం. ఈ రూల్ కాదు’ అని పేర్కొన్నారు.