News March 8, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ బేతంచర్ల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం☞ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 461 మంది డుమ్మా☞ బెలుం సింగవరంలో భార్య హత్య కేసులో భర్త అరెస్ట్☞ అంతర్జాతీయ స్థాయి పోటీలకు సంజామల PD☞ ప్రతిభకు వికలత్వం అడ్డుకాదు: ఎంపీ శబరి☞ కోవెలకుంట్లలో తండ్రి కొడుకుల అదృశ్యం☞ పోసానిని కష్టడికి ఇవ్వండి: ఆదోని పోలీసులు☞ శ్రీశైలంలో భక్తుల తాకిడి☞ రైతు నగర్లో భారీ చోరి☞ జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవం
Similar News
News November 14, 2025
సాక్షి మృతి.. అదే ఫార్ములా రిపీట్: TDP

TTD మాజీ AVSO సతీశ్ మృతిపై TDP చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ‘కేసులో సాక్షి గల్లంతైతే నేర నిరూపితం కష్టమే. అందుకేనేమో కేసు కొలిక్కి వస్తుందనుకున్న టైంలో సాక్షి చచ్చిపోతాడు. పరిటాల రవి కేసు నుంచి పరకామణి కేసు వరకు అదే ఫార్ములా రిపీట్. నాడు బాబాయ్ వివేకానంద రెడ్డిపై గొడ్డలి వేటు వేసి గుండెపోటు అని, నేడు మాజీ AVSOని చంపేసి బలవన్మరణం అని YCP ప్రచారం చేస్తోంది’ అని TDP ఆరోపించింది.
News November 14, 2025
వివాహం గురించి వేదాలేమంటున్నాయి?

పెళ్లంటే నూరేళ్ల పంట. వివాహం కుటుంబ వ్యవస్థకు ప్రధానమైన ఆధారం. ఇది గృహస్థాశ్రమ ధర్మానికి నాంది. మన మేధో వికాసానికి, సామాజిక ఎదుగుదలకు ఇది అత్యంత ముఖ్యమైనదని వేదాలు కూడా చెబుతున్నాయి. ఈ పవిత్ర వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచమంతా కొనియాడుతుంది. వివాహం ద్వారానే సంస్కృతికి, సమాజానికి పునాది పడుతుంది. అందుకే ఈ బంధాన్ని పవిత్రంగా గౌరవించాలి. ఈ బంధం రేపటి తరానికి ఉత్తమమైన వారసత్వాన్ని అందిస్తుంది. <<-se>>#Pendli<<>>
News November 14, 2025
ఆర్చరీలో సత్తా చాటిన తెలుగు కుర్రాడు

ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర(VJA) చరిత్ర సృష్టించారు. వ్యక్తిగత విభాగంలో రాహుల్(IND)పై 6-2 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. మహిళల విభాగంలో అంకితా భకత్ 7-3 తేడాతో సౌ.కొరియా ఆర్చర్ నామ్ సు-హ్యోన్పై నెగ్గి గోల్డ్ గెలిచారు. ఏషియన్ రికర్వ్ ఆర్చరీలో INDకు ఇవే తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్ కావడం విశేషం. ఈ టోర్నీలో IND 6 గోల్డ్, 3 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ నెగ్గింది.


