News March 12, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డికి మంచు మనోజ్ దంపతుల నివాళి
☞ రేపు కోవెలకుంట్ల, నంద్యాల GDCల్లో జాబ్ మేళా
☞ పోసాని విడుదలకు బ్రేక్.. గుంటూరుకు తరలింపు
☞ చెన్నంపల్లెలో భవన నిర్మాణ కార్మికుడి మృతి
☞ యువత పోరులో కలెక్టర్ కు YCP నేతల వినతి
☞ రంగాపురంలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
☞ తండ్రి మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు
☞ శ్రీశైలంలో 27 నుంచి ఉగాది మహోత్సవాలు
☞ ఎర్రగుంట్ల PS సస్పెండ్
Similar News
News January 8, 2026
BRAEKING: బాంబు బెదిరింపు.. విశాఖ జిల్లా కోర్టులో తనిఖీలు

విశాఖ జిల్లా కోర్టుల వాణిజ్య సముదాయంలో భద్రతా సిబ్బంది గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టు మెయిల్కు బాంబు పెట్టినట్లుగా సమాచారం రావడంతో ఈ తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లుగా సమాచారం. తనిఖీల్లో ఎక్కడా బాంబు సామగ్రి దొరకలేదు. పార్కింగ్ స్థలాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేశారు.
News January 8, 2026
NZB: 13 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి పట్టుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ES మల్లారెడ్డి తెలిపారు. ADBకి చెందిన పూజ పవర్, డి.బాయి జాదవ్ లు MP లో గంజాయి కొనుగోలు చేసి MH కు చెందిన కిషన్ మోతిరామ్ దాలే, ఇంద్రజిత్ టాగ్రే లను కలుపుకొని, చద్మల్కు చెందిన మంజ వెంకట్రాంకు గంజాయిని ఇస్తుండగా CI స్వప్న ఆధ్వర్యంలో పట్టుకున్నామని వివరించారు.
News January 8, 2026
సంగారెడ్డి: రేపు టీఎన్జీవో జిల్లా ఎన్నికలు

సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో ఎన్నికలు ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ తెలిపారు. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు. ఎక్కువ మంది పోటీ చేస్తే ఎన్నికలు నిర్వహించి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని పేర్కొన్నారు.


