News March 14, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ పాణ్యంలో ఎండ ధాటికి స్కూటీ దగ్ధం
☞ ఎస్సీ వర్గీకరణ అధ్యయనానికి సభ్యుడిగా మంత్రి బీసీ
☞ YCP నేతపై హత్యాయత్నం.. 9 మంది TDP నేతలపై కేసు
☞ హత్యాయత్నం కేసులో ఇద్దరికీ 7 ఏళ్ల జైలు శిక్ష
☞ సంతేకుడ్లూరులో వింత ఆచారం.. స్త్రీ వేషధారణలో పురుషులు
☞ బ్రాహ్మణకొట్కూరు విద్యార్థినికి బంగారు పతకం
☞ కోవెలకుంట్ల జాబ్ మేళాలో 38 మందికి ఉద్యోగాలు
☞ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు
Similar News
News March 15, 2025
NLG: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదో తరగతికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30న సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
News March 15, 2025
ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన

ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైమరీ పాఠశాలల్లో శనివారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) బోధన ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. తలమడుగు మండలం దేవాపూర్ ప్రైమరీ స్కూల్ తెలుగు, ఉర్దూ మీడియం, కోడద్ ప్రైమరీ స్కూల్, ఆదిలాబాద్ అర్బనులోని తాటిగూడ ప్రైమరీ పాఠశాలల్లో ఈ AI ప్రోగ్రాం ఉండనుందని వెల్లడించారు.
News March 15, 2025
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 41 దేశాలకు పైగా ప్రజలకు ప్రయాణ ఆంక్షలు విధించాలని ఆయన భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. దాని ప్రకారం.. అఫ్ఘాన్, పాకిస్థాన్, భూటాన్, మయన్మార్ వంటి అనేక దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయి ఆమోదం రాలేదని, జాబితాలో స్వల్ప మార్పులు ఉండొచ్చని శ్వేతసౌధ వర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.