News March 9, 2025
నంద్యాల జిల్లాలో నేటి TOP NEWS

☞ అబద్ధపు హామీలతోనే టీడీపీ గద్దెనెక్కింది: కాటసాని ☞ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి బీసీ ☞ గాజుల పల్లెలో రైల్వే బోగీల తొలగింపు.. రైళ్ల రాకపోకల పున:ప్రారంభం ☞ ఆళ్లగడ్డలో మొబైల్ షాప్ ఓపెనింగ్.. ఓనర్, కస్టమర్ మధ్య వివాదం ☞ అర్ధరాత్రి కర్నూలుకు పోసాని ☞ బనగానపల్లెలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ ☞ బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య ☞ అధికారంతో దాడులు చేసింది వైసీపీనే: కాట్రెడ్డి
Similar News
News January 2, 2026
రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్కాస్ట్లో వివరించారు.
News January 2, 2026
KMR: ఈ నెల 3న జాబ్ మేళా

కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల మూడో తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం చెప్పారు. బీపీఓ పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News January 2, 2026
ఈడుపుగల్లుకు రైలు కూత.. 49 కి.మీ కొత్త రైల్వే లైన్

తరిగొప్పుల-దుగ్గిరాల మధ్య ప్రతిపాదిత 49k.m కొత్త రైల్వే లైన్లో ఈడుపుగల్లు రైల్వేస్టేషన్ కేంద్రంగా మారనుంది. లొకేషన్ సర్వే, మట్టి నమూనాల పరిశీలన పూర్తికావడంతో భూసేకరణ, ట్రాక్, స్టేషన్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. తరిగొప్పుల నుంచి చీలి, మంతెన దక్షిణంగా రైవాస్ కాలువ మీదుగా ఈడుపుగల్లు,వణుకూరు వైపు ట్రాక్ వెళ్లనుంది. చోడవరం వద్ద రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికీ కసరత్తు సాగుతోంది.


