News March 9, 2025

నంద్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

☞ అబద్ధపు హామీలతోనే టీడీపీ గద్దెనెక్కింది: కాటసాని ☞ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి బీసీ ☞ గాజుల పల్లెలో రైల్వే బోగీల తొలగింపు.. రైళ్ల రాకపోకల పున:ప్రారంభం ☞ ఆళ్లగడ్డలో మొబైల్ షాప్ ఓపెనింగ్.. ఓనర్, కస్టమర్ మధ్య వివాదం ☞ అర్ధరాత్రి కర్నూలుకు పోసాని ☞ బనగానపల్లెలో ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ఢీ ☞ బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య ☞ అధికారంతో దాడులు చేసింది వైసీపీనే: కాట్రెడ్డి

Similar News

News March 23, 2025

EVల బీమాకు భారీగా పెరిగిన డిమాండ్

image

ఎలక్ట్రిక్ వాహనాల బీమాకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత మూడేళ్లలో 16 రెట్లు పెరిగినట్లు పాలసీబజార్ అంతర్గత డేటా చెబుతోంది. EV కార్ల బీమా పాలసీల వాటా FY23లో కేవలం 0.50%గా ఉండగా, మార్చి 2025 నాటికి 14%కి విస్తరించి 8.2% వద్ద నిలిచింది. ఢిల్లీ, బెంగళూరు, పుణే, చెన్నై, ముంబై సిటీల్లో ఈవీల వాడకం ఎక్కువగా ఉందని, 55% బీమా పాలసీలు ఈ నగరాల్లోనే కొనుగోలు చేస్తున్నట్లు పాలసీ బజార్ నివేదిక పేర్కొంది.

News March 23, 2025

కల్వకుర్తి: నీటి సంపులో పడి మహిళ మృతి

image

కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ నిర్మల విద్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న బాలకృష్ణమ్మ (49) నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ఆవరణలోని సంపులో శనివారం ప్రమాదవశాత్తు జారి పడినట్లు చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త 15 నెలల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది.

News March 23, 2025

మెదక్: విషాదం.. అప్పుల బాధతో రైతు మృతి

image

అప్పుల బాధతో రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు..  కుషన్ గడ్డ తండాకు చెందిన పాల్త్యజీవుల (50) నెల రోజుల్లోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు వేయించిన, నీళ్లు రాలేదు. బోర్ల కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!