News October 16, 2024
నంద్యాల జిల్లాలో నేడు సెలవు

నంద్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అలాగే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేశామని అన్నారు. కాగా కర్నూలు జిల్లాలో సెలవు ప్రకటించలేదు.
Similar News
News February 23, 2026
కర్నూలు జిల్లాలో రైతులకు పుష్కలంగా యూరియా నిల్వలు

కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 రబీ సీజన్ కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశారు. యూరియాను అధిక ధరలకు అమ్మినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల కొరతపై ఫిర్యాదుల కోసం 8341302863 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.
News February 23, 2026
కర్నూలు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నిర్వహించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశించిన గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని, ప్రతి అర్జీని సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News February 23, 2026
ఆ లింకులు నమ్మకండి.. ఎస్పీ హెచ్చరిక!

ఎనిమిదో వేతన సంఘం నేపథ్యంలో “8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్” పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్ ద్వారా పంపిస్తున్న ఏపీకే(APK) ఫైళ్లను డౌన్లోడ్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని, ఇటువంటి మోసాల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.


