News August 9, 2024
నంద్యాల జిల్లాలో భారీగా SIల బదిలీ
నంద్యాల జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. 20 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా 15 మందికి వివిధ మండలాలకు పోస్టింగ్ ఇవ్వగా, మరో ఐదుగురు ఎస్సైలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఈ మేరకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News September 9, 2024
శ్రీశైలం: గణపయ్యకు 130 రకాల ప్రసాదాలు నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆయా గణేశ్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన అలంకారం మండపంలో కొలువుతీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. కొత్త బజార్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బొజ్జా గణపయ్యకు 130 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు.
News September 9, 2024
ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోంది: మంత్రి ఫరూక్
ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తోందని నంద్యాల ఎమ్మెల్యే, మంత్రి ఫరూక్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలకు పెంచడం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, పోలవరం నిర్మాణం, పకృతి విపత్తుల సమర్ధ నిర్వహణపై దృష్టి సారించామని అన్నారు.
News September 9, 2024
జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు గ్రామీణ విద్యార్థిని ఎంపిక
కోసిగి మండలం జంపాపురానికి చెందిన అశ్విని జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైనట్లు తల్లిదండ్రులు బసవ, పార్వతీ తెలిపారు. అశ్విని కడప సైనిక్ స్కూల్లో చదువుకుంటూ ఫుట్‌బాల్ క్రీడలో కొన్నేళ్లుగా రాణిస్తోందని అన్నారు. కర్నూలు జిల్లా జట్టులో సభ్యురాలిగా ఉంటూ రాష్ట్ర జట్టులో చోటు సంపాదించిందన్నారు. ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు.