News February 18, 2025
నంద్యాల జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే నంద్యాలలో ఆదివారం, సోమవారం వరుసగా 37.23°, 37.22° ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీటితో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News October 13, 2025
కెంటన్ మిల్లర్ అవార్డు సాధించిన మొదటి భారత మహిళ

కజిరంగా నేషనల్ పార్క్ మొదటి మహిళా ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న సొనాలి ఘోష్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా ప్రపంచంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటైన IUCN కెంటన్ మిల్లర్ అవార్డును పొందారు. వణ్యప్రాణుల సంరక్షణకు గానూ ఆమెకు ఈ అవార్డు వచ్చింది. పూణేలో జన్మించిన సొనాలి వైల్డ్‌లైఫ్ సైన్స్, ఎన్విరాన్మెంట్ లా చదివారు. పులులను ట్రాక్ చేసే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీపై పరిశోధించి డాక్టరేట్ పొందారు.
News October 13, 2025
జీఎస్టీ 2.0 తో ప్రజలకు ఊరట: కలెక్టర్

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు కలెక్టర్ కీర్తి చేకూరి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకు ఊరట లభిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తెచ్చిందని వివరించారు.
News October 13, 2025
మందమర్రి: ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

మందమర్రి సింగరేణి ఏరియా కేకే ఓపెన్ కాస్ట్ గనిని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ప్రాజెక్ట్ స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓబీ ప్లాంట్ వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. మైనింగ్ కార్యకలాపాలను వీక్షించారు. కృషి పట్టుదలతో ఏదైనా సాధ్యమని, విజయాన్ని ఉద్యోగులు, కార్మికులు ప్రేరణ తీసుకోవాలన్నారు.