News February 18, 2025

నంద్యాల జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

image

జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే నంద్యాలలో ఆదివారం, సోమవారం వరుసగా 37.23°, 37.22° ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీటితో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News March 23, 2025

వచ్చే నెలలో కెనడాలో ఎన్నికలు

image

కెనడాలోని 338 పార్లమెంటు స్థానాలకు వచ్చే నెల 28న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కొత్త ప్రధాని కార్నీ త్వరలోనే ప్రకటన విడుదల చేయొచ్చని తెలుస్తోంది. కొత్త నాయకత్వం వచ్చాక అధికార లిబరల్ పార్టీవైపు ప్రజామోదం ఉన్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పీఎం కార్నీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లు సమాచారం.

News March 23, 2025

అంతర్జాతీయ పోటీలకు నిజామాబాద్ విద్యార్థిని ఎంపిక

image

భారత అండర్-15 సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన విద్యార్థిని ఎంపికైంది. ఈ నెల 25వ తేదీ నుంచి 30 వరకు తైవాన్‌లో జరిగే సాఫ్ట్ బాల్ పోటీల్లో డిచ్‌పల్లి మండలం సుద్దులం గురుకుల పాఠశాలకు చెందిన గన్న హర్షిని పాల్గొననుంది. ఈ సందర్భంగా క్రీడాకారిణిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్, తిరుపతి పాల్గొన్నారు.

News March 23, 2025

కొణిదెల గ్రామానికి రూ.50 లక్షలు: పవన్ కళ్యాణ్

image

నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామాభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు ప్రకటించారు. పూడిచర్లలో ఫారమ్ పాండ్స్‌కు శంకుస్థాపన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. తన సొంత ట్రస్టు నుంచి నిధులను కేటాయించారు. ఎమ్మెల్యేతో మాట్లాడి కొణిదెల గ్రామానికి ఏం అవసరమో అవన్నీ చేస్తానని, ప్రభుత్వ పథకాలన్నీ ఈ ఊరి ప్రజలకు అందేలా చూస్తానని పవన్ హామీ ఇచ్చారు. కాగా, పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొణిదెల అని తెలిసిందే.

error: Content is protected !!