News February 7, 2025
నంద్యాల జిల్లాలో యూరియా కొరత!

నంద్యాల జిల్లాలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రైతు సేవా కేంద్రాల్లో యూరియా లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కళ్లు గప్పి కొందరు డీలర్లు యూరియా బస్తాలను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి రైతుసేవ కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News October 21, 2025
పేరుపాలెం బీచ్ సందర్శకులకు అనుమతి లేదు: ఎస్ఐ

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున బుధవారం పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులను అనుమతించడం లేదని మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
News October 21, 2025
సంగారెడ్డి: ’41 మంది ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులైరజేషన్’

జిల్లాలోని వివిధ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న 41 మంది ఉపాధ్యాయుల సర్వీస్‌ను రెగ్యులరైజేషన్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. డీఎస్సీ ద్వారా 2019, 2020 సంవత్సరంలో నూతనంగా నియామకం అయిన ఉపాధ్యాయుల సర్వీస్‌ను రెగ్యులరైజేషన్ చేసినట్లు పేర్కొన్నారు.
News October 21, 2025
రేపట్నుంచి UAEలో చంద్రబాబు పర్యటన

AP: పెట్టుబడుల సాధన కోసం CM CBN రేపట్నుంచి 3 రోజుల పాటు UAEలో పర్యటించనున్నారు. తొలుత దుబాయ్‌లో CII నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. శోభా, లోధా, షరాఫ్ డీజీ గ్రూపులు, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల అధిపతులతో భేటీ అవుతారు. 24న AP NRT చేపట్టే తెలుగు డయాస్పోరా సదస్సుకు హాజరవుతారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులతోనూ CBN చర్చిస్తారు. NOV 14, 15 తేదీల్లో జరిగే VSP సమ్మిట్‌కు ఆయా సంస్థలను ఆహ్వానించనున్నారు.