News April 11, 2025
నంద్యాల జిల్లాలో రాబోయే 3 గంటల్లో వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది. కాగా ఇవాళ సాయంత్రం నుంచి నంద్యాల నగరంలో వాతావరణ మారింది.
Similar News
News September 17, 2025
ఈ నెల 23 నుంచి ఓటీటీలోకి ‘సుందరకాండ’

నారా రోహిత్, శ్రీదేవి, వర్తి వాఘని ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుందరకాండ’ జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం గత నెల 27న థియేటర్లలో రిలీజైంది.
News September 17, 2025
డీఎస్సీలు అభ్యర్థులకు ఈనెల 19న నియామక పత్రాలు: డీఈవో

అనంతపురం జిల్లాలో డీఎస్సీలో 755 మంది ఉద్యోగాలు సాధించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. 75 మందిని అమరావతికి తీసుకెళ్లేందుకు 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు రేపు ఉదయం 6 గంటలకు అనంతపురంలోని PVKK కళాశాలకు చేరుకోవాలని సూచించారు.
News September 17, 2025
WGL: పసుపు క్వింటా రూ.10,555

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పలు రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,530 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.,4500 ధర పలికింది. అలాగే మక్కలు (బిల్టీ)కి రూ.2,300 ధర వచ్చింది. మరో వైపు దీపిక మిర్చి క్వింటా రూ.14 వేలు, పసుపు రూ.10,555 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.