News April 16, 2025
నంద్యాల జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. వివిధ కేంద్రాల్లో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను మే 1 నుంచి 31 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ అధికారి రాజు తెలిపారు. శిక్షణ శిబిరాలు నిర్వహించాలనే ఆసక్తి గల క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు ముందుకు రావాలని కోరారు.
Similar News
News October 28, 2025
నల్గొండ: పిచ్చికుక్క బీభత్సం.. ఏడుగురికి గాయాలు

నల్గొండ నాలుగో వార్డు, కేశరాజుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ పిచ్చికుక్క దాడిలో ఏడుగురు గాయపడ్డారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని, రోడ్డుపై వెళ్లే బైకర్లను కూడా వెంటాడి గాయపరుస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఆ పిచ్చికుక్కను పట్టుకోవాలని వారు కోరుతున్నారు.
News October 28, 2025
కెరమెరిలో పాము కాటుతో మహిళ మృతి

కెరమెరి మండలం సావర్ ఖేడ గ్రామానికి చెందిన మొహర్లే సంధ్య (31) పాముకాటుతో మృతి చెందింది. సోమవారం సాయంత్రం తన పత్తి పొలంలో పత్తి తీసే క్రమంలో సాయంత్రం పాముకాటు వేసింది. స్థానిక కుటుంబ సభ్యులు గమనించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News October 28, 2025
పొట్టి కప్ అయినా పట్టేస్తారా?

ఆసీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ రేపటి నుంచి 5 మ్యాచుల T20 సమరానికి సిద్ధమైంది. బుమ్రా జట్టులోకి రానుండటం ప్లస్ కానుంది. అతడి సారథ్యంలో పేస్ దళం AUSను ఎలా కట్టడి చేస్తుందో చూడాలి. అటు యంగ్ ఇండియా బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తిగా మారింది.
స్క్వాడ్: సూర్య, అభిషేక్, గిల్, తిలక్, నితీశ్, దూబే, అక్షర్, జితేశ్, వరుణ్, బుమ్రా, అర్ష్దీప్, కుల్దీప్, హర్షిత్, సంజూ, రింకూ, సుందర్


