News September 2, 2024

నంద్యాల జిల్లాలో శతాధిక వృద్ధురాలి మృతి

image

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం చెన్నూరు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు సింగిరెడ్డి లక్ష్మమ్మ (110) ఆదివారం మృతి చెందారు. ఈ వయసులోనూ చాలా చురుగ్గా ఉండేవారని, తన పనులు తానే స్వయంగా చేసుకునేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరి మీద ఆధార పడకుండా ఇన్నేళ్లు జీవించిన లక్ష్మమ్మ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మిత ఆహారమే ఇన్ని రోజులు బతకడానికి కారణమని స్థానికులు తెలిపారు.

Similar News

News September 18, 2024

ధర్మవరం సుబ్బారెడ్డికి కీలక పదవి దక్కనుందా?

image

నామినేటెడ్ పదవుల కోసం జిల్లా TDP నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండగా ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలు ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో డోన్ TDP ఇన్‌ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డికి కీలక పోస్ట్ వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూల్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆయనను నియమించనున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

News September 18, 2024

వంద రోజుల ప్రణాళిక లక్ష్యాలను చేరుకోండి: కలెక్టర్

image

వంద రోజుల ప్రణాళికలో భాగంగా శాఖల వారిగా నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్ రెండో తేదీ లోపు పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 100 రోజుల ప్రణాళికల లక్ష్యాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ ప్రాంతంలో వందరోజుల ప్రణాళికలో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ లో 1,83,600 మొక్కలను నాటామన్నారు.

News September 17, 2024

కర్నూలు: రూ.2 లక్షలు పలికిన మహాగణపతి లడ్డూ

image

కర్నూలు పాత నగరంలోని తుంగభద్ర నదీ తీరాన కొలువుదీరిన 63 అడుగుల మహాగణపతి విగ్రహం వద్ద జరిగిన లడ్డూ వేలం పాటలో కాంచనం సురేశ్ బాబు (స్వస్తిక్ డెవలపర్స్) రూ.2 లక్షలకు దక్కించుకున్నారు. నగరానికి చెందిన చింటూ, భరత్, వికాస్ స్వామివారి హుండీని రూ.1,45,000కు పాట పాడి దక్కించుకున్నారు.