News January 6, 2025

నంద్యాల జిల్లాలో 13,92,036 మంది ఓటర్లు

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టి తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని డీఆర్ఓ రామునాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటర్ల సవరణ అనంతరం జిల్లాలో 13,92,036 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో పురుష ఓటర్లు 6,81,581మంది, మహిళా ఓటర్లు 7,10,193 మంది, ఇతరులు 262 మంది ఉన్నారన్నారు. అన్ని నియోజకవర్గాల పోలింగ్ స్టేషన్లలో ఈఆర్వోలు తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తున్నారన్నారు.

Similar News

News October 29, 2025

కర్నూలు జిల్లాలో పాఠశాలలకు సెలవు

image

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ రోజు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. స్టడీ క్లాసులు లేదా అదనపు తరగతులు నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఇంటి వద్ద సురక్షితంగా ఉంచాలని సూచించారు.

News October 29, 2025

కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

image

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

News October 29, 2025

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్ విద్యార్థి

image

నవంబర్లో గుంటూరులో జరగబోయే రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్.షాకీర్ ఎంపికైనట్టు పాఠశాల హెడ్మాస్టర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సుదర్శన్ రావు, శేఖర్ మీడియాతో మాట్లాడారు. కర్నూలులో జరిగిన ఎంపిక పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి ఉద్యమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు తెలిపారు.