News May 1, 2024

నంద్యాల జిల్లాలో 20,509 మందికి హోం ఓటింగ్ అవకాశం

image

హోం ప్రక్రియ ఓటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని మైక్రో అబ్జర్వర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సుమారు 15,509 మంది దివ్యాంగులు, 5వేల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు వెల్లడించారు. వారికి ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద ఓటు హక్కు కల్పించిన నేపథ్యంలో హోం ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో 45మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించామన్నారు.

Similar News

News October 1, 2024

కర్నూలులో కుక్కల దాడి.. 30 మందికి గాయాలు

image

కర్నూలులోని వన్‌టౌన్‌ పరిధిలో కుక్కలు దాడి చేయడంతో 30 మందికిపైగా చిన్నారులు గాయపడ్డారు. వన్‌టౌన్‌ పరిధిలోని బండిమెట్ట, గడ్డా వీధి, చిత్తారి వీధి, గరీబ్‌ నగర్‌ ప్రాంతాల్లో సోమవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. గాయపడిన చిన్నారులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత చిన్నారులను మంత్రి భరత్‌, జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా పరామర్శించారు. గాయపడిన ఒక్కో చిన్నారికి రూ.10వేల పరిహారం అందిస్తామన్నారు.

News October 1, 2024

నేడు పత్తికొండకు CM చంద్రబాబు

image

కర్నూలు (D) పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉ.11:40 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి 12:30కు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ఏ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 12:40 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1:05 నిమిషాలకు పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకుంటారు. అనంతరం గ్రామంలో పింఛన్ పంపిణీ చేస్తారు. సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News October 1, 2024

800 మందితో భారీ బందోబస్తు: కర్నూలు ఎస్పీ

image

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో నేడు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బిందు మాధవ్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. DSPలు-5, CIలు-38, SIలు-40, ASI, HCలు-160, PCలు-213, హోంగార్డులు-106 మందితో పాటుగా 3 ఏఆర్, 5 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించినట్లు ఈమేరకు ఎస్పీ వెల్లడించారు.