News April 4, 2025
నంద్యాల జిల్లాలో 8 మంది ఎస్సైలు బదిలీ!

నంద్యాల జిల్లాలో VRలో పనిచేస్తున్న పలువురు SIలను బదిలీ చేస్తూ గురువారం జిల్లా SP అధిరాజ్ సింగ్ రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఎం.రామస్వామిని నంద్యాల 3 టౌన్‌కు, ఎ.అమ్జద్ అలీని డోన్ రూరల్, బి.శ్రీనివాసరావును నంద్యాల డీసీఆర్ బీకి బదిలీ చేశారు. మరింకొందరిలో శ్రీనివాసులును నంద్యాల PCRకు, తిరుపాల్‌ను బేతంచర్ల, గోపాల్‌ను కొలిమిగుండ్లకు, జగన్నాథ్‌ను డోన్ అర్బన్‌కు, మహమ్మద్‌ని నంద్యాల తాలూకాకు బదిలీ చేశారు.
Similar News
News November 10, 2025
హజ్ యాత్రపై సౌదీతో ఒప్పందం.. భారత్ కోటా ఎంతంటే..

హజ్ యాత్రకు సంబంధించి భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2026 సంవత్సరానికి గాను భారత్ కోటా కింద 1,75,025 మంది యాత్రికులకు అనుమతివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జెడ్డాలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, సౌదీ మంత్రి తౌఫిక్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. హజ్ ఏర్పాట్ల గురించి వీరిద్దరూ సమీక్షించారు. కోఆర్డినేషన్, రవాణా మద్దతు, తీర్థయాత్ర సజావుగా సాగడం వంటి అంశాలపై చర్చించారు.
News November 10, 2025
సీతారాంపురం గ్రామంలో టిప్పర్ బీభత్సం

ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున అతివేగంతో దూసుకొచ్చిన ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న కుట్టు మిషన్ల యూనిట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షెడ్లు, యంత్రాలు ధ్వంసమయ్యాయి. తెల్లవారుజాము కావడంతో యూనిట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 10, 2025
ఖమ్మం: ఉపాధ్యాయుల హాజరుపై ‘యాప్’ కొరడా!

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు కోసం ప్రవేశపెట్టిన FARS యాప్ ఇప్పుడు ఉపాధ్యాయులపై నిఘా పెట్టింది. హాజరు తక్కువ ఉన్న హెచ్ఎంలను కలెక్టర్ మందలించారు. సక్రమంగా హాజరుకాని టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సమయపాలన, సెలవు/ఓడీ అప్డేట్ యాప్‌లో తప్పనిసరి. ఈ కఠిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.


