News March 1, 2025
నంద్యాల జిల్లాలో 87.75% పింఛన్ల పంపిణీ.!

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నంద్యాల జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. మ.2:30 గంటలకు నంద్యాల జిల్లాలో 87.75% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా ఇప్పటివరకు జిల్లాలో 2,15,031 మందికి గానూ 1,88,688 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.
Similar News
News March 2, 2025
TODAY HEADLINES

AP: జూన్ నాటికి DSC ప్రక్రియ పూర్తి: సీఎం చంద్రబాబు
AP: ఆశా వర్కర్ల రిటైర్మెంట్ వయసు పెంపు
AP: జైలులో పోసానికి అస్వస్థత.. నాటకం ఆడారన్న పోలీసులు
TG: కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్
TG: దేశానికి రోల్ మోడల్‌లా పోలీస్ స్కూల్: CM రేవంత్
TG: రేవంత్ మంచి పనులు చేయలేదు: KTR
☛ ఫిబ్రవరి GST కలెక్షన్స్ రూ.1.84లక్షల కోట్లు
☛ ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీస్‌కు సౌతాఫ్రికా
News March 2, 2025
ఈనెల 8న కొత్త పథకాలు ప్రారంభం: మంత్రి సీతక్క

TG: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆ రోజున CM రేవంత్ కొత్త పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. RTCకి అద్దెకు ఇచ్చే మహిళా సంఘాలకు చెందిన 50 బస్సులను ప్రారంభిస్తారని, 14,236 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.
News March 2, 2025
నాగర్ కర్నూల్ జిల్లా.. నేటి ముఖ్యాంశాలు

✓నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో స్వయం స్వపరిపాలన దినోత్సవం నిర్వహణ.
✓నాగర్ కర్నూల్ జిల్లాలో రేపటి నుండి రంజాన్ మాస ఉపవాస అధ్యక్షులు ప్రారంభం.
✓జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.
✓వంగూరు మండలం కొండారెడ్డిపల్లి లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు హేమలత పదవి విరమణ.
✓ముస్లిం సోదరి సోదరీ మణులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.