News September 7, 2024
నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మీ నరసింహ యాదవ్
నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జే.లక్ష్మీ నరసింహ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, MP కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈయన గత ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
Similar News
News October 9, 2024
పతకాలు సాధించిన క్రీడాకారులకు కలెక్టర్ అభినందన
రాజమండ్రిలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన కర్నూలు జిల్లా క్రీడాకారులను కలెక్టర్ రంజిత్ బాషా అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, అథ్లెటిక్స్ కోచ్ కాశీ రావు పాల్గొన్నారు.
News October 9, 2024
బన్ని ఉత్సవాలకు పోలీసు బందోబస్తు: ఎస్పీ
12న జరిగే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాలకు 800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఏడుగురు డీఎస్పీలు, 42 మంది సీఐలు, 54 మంది ఎస్సైలు, 112 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 362 మంది కానిస్టేబుళ్లు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 3 ప్లటూన్ల ఏఆర్ పోలీసులు, 95 మంది హోంగార్డులు విధుల్లో ఉంటారన్నారు.
News October 9, 2024
‘సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించండి’
సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వచ్చినందున ఉమ్మడి కర్నూలు జిల్లాలోని KC కెనాల్, తుంగభద్ర LLC, హంద్రీనీవా వంటి నీటి సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయని, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు నాంది కావాలన్నారు.