News January 2, 2025
నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసిన రేషన్ డీలర్లు
నూతన సంవత్సరం 2025 సందర్భంగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సీ.విష్ణు చరణ్, నంద్యాల ఆర్డీవోను నంద్యాల జిల్లా రేషన్ డీలర్లు కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల టౌన్ రేషన్ డీలర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 24, 2025
కర్నూలు: మెయిన్స్ పరీక్షకు 310 మంది అర్హత
కర్నూలులో 14వ రోజు పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా దగ్గరుండి పర్యవేక్షించారు. ఇవాళ 600 మంది అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షలకు పిలవగా మెయిన్స్(ఫైనల్) పరీక్షకు 310 మంది అర్హత సాధించారని అధికారులు తెలిపారు.
News January 24, 2025
వినతులను త్వరితగతిన పరిష్కరించాలి: ఆదోని సబ్ కలెక్టర్
గోనెగండ్ల గ్రామంలోని మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో తహశీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు.
News January 24, 2025
నంద్యాల: కారు కొంటామని ఎత్తుకెళ్లారు
నంద్యాల ఆటోనగర్‌లో కారు విక్రయించడానికి వచ్చిన ఇరువురు వ్యక్తులను కారు కొంటాని నమ్మించి కారు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం తెలంగాణ నారాయణపేటకు చెందిన వెంకటేష్ రెడ్డి కారు నంద్యాలలో విక్రయించి రావాలని దళారి రాఘవేంద్ర, హనుమంతుకు అప్పగించారు. వారు NDL ఆటోనగర్‌కు రాగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం వెంకటేష్ రెడ్డి తాలూకా స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.