News February 19, 2025
నంద్యాల జిల్లా టాప్ న్యూస్

➤ ఈ నెల 23-26 వరకు మల్లన్న ప్రసాదం ఉచితం: శ్రీశైలం ఈవో➤ క్రికెట్ ఆడిన మంత్రి బీసీ➤ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి➤ మహాశివరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు: నంద్యాల ఏఎస్పీ ➤ గ్రామాల అభివృద్ధికి కృషి: డోన్ ఎమ్మెల్యే➤ గండ్లేరులో చేప పిల్లలు వదిలిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే➤ జిల్లాలో కొనసాగిన రుణాల దరఖాస్తులకు వెరిఫికేషన్ ప్రక్రియ➤ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం
Similar News
News March 12, 2025
విశాఖలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఉపాధి

స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉపాధి, శిక్షణ కల్పిస్తున్నట్లు సీఈవో ఇంతియాజ్ ఆర్షేడ్ బుధవారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 15వ తేదీలోపు ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సముదాయంలో ఉన్న ఆఫీసులో సంప్రదించాలని కోరారు. ఐటిఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
News March 12, 2025
మారనున్న KBC హోస్ట్!

‘కౌన్ బనేగా కరోడ్పతి’ హోస్ట్గా చేస్తోన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ సీజన్ నుంచి వైదొలిగే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. దీంతో తర్వాతి హోస్ట్ ఎవరనే చర్చ మొదలైంది. ఆయన స్థానంలో బాలీవుడ్ నటీనటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీలలో ఒకరిని నియమిస్తారని సమాచారం. 2007 KBCలో షారుఖ్ హోస్ట్గా చేసిన విషయం తెలిసిందే. ఎవరిని నియమిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.
News March 12, 2025
సిద్దిపేట: దివ్యాంగులు ధైర్యంగా ఉండాలి: డీఈఓ

దివ్యాంగులు నిరుత్సాహపడకుండా ధైర్యంగా మానసిక స్తైర్యంతో ఉండాలని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట టీటీసీ భవన్లో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని 57 మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. డీఈవో మాట్లాడుతూ.. దివ్యాంగులు ఉపకరణాలు ఉపయోగించి మానసికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.