News February 19, 2025
నంద్యాల జిల్లా టాప్ న్యూస్

➤ ఈ నెల 23-26 వరకు మల్లన్న ప్రసాదం ఉచితం: శ్రీశైలం ఈవో➤ క్రికెట్ ఆడిన మంత్రి బీసీ➤ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి➤ మహాశివరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు: నంద్యాల ఏఎస్పీ ➤ గ్రామాల అభివృద్ధికి కృషి: డోన్ ఎమ్మెల్యే➤ గండ్లేరులో చేప పిల్లలు వదిలిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే➤ జిల్లాలో కొనసాగిన రుణాల దరఖాస్తులకు వెరిఫికేషన్ ప్రక్రియ➤ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం
Similar News
News March 22, 2025
జనగామ: 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి: కలెక్టర్

రబీ సీజన్ 2024-25కి సంబంధించి ధాన్యం కొనుగోలుపై శనివారం జనగామ కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సమావేశం నిర్వహించారు. మొత్తం 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేయగా, అందులో 2,35,954 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో 62,013 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, దొడ్డు రకం 1,73,941 మెట్రిక్ టన్నులు సేకరించాలని అంచనా వేశామని చెప్పారు.
News March 22, 2025
KMR: స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలి: కలెక్టర్

స్కానింగ్ కేంద్రాలపై నిఘా పెంచాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం అమలు కోసం జిల్లా మల్టీ మెంబర్ అథారిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిజిష్టర్‌ల నిర్వహణ పకడ్బందీగా ఉండేట్లు చూడాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా జడ్జి వర ప్రసాద్ ఉన్నారు.
News March 22, 2025
HYD: ప్రియుడి సూచన.. NTR స్టేడియంలో దారుణం

NTR స్టేడియంలో పసిపాపను కాల్చివేసిన ఘటనలో మైనర్ బాలుడిని దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కవాడిగూడకు చెందిన మైనర్ బాలిక, నల్గొండ జిల్లాకు చెందిన బాలుడు ప్రేమించుకుంటున్నారు. శారీరకంగానూ ఒక్కటి అవ్వడంతో బాలిక గర్భం దాల్చింది. నెలలు నిండక ముందే డెలివరీ కావటంతో పుట్టుకతోనే పాప చనిపోయింది. ప్రియుడి సూచన మేరకు NTR స్టేడియంలో మృతశిశువును బాలిక కాల్చివేసింది. పోలీసులు బాలుడిని జువైనల్‌కి తరలించారు.