News February 23, 2025
నంద్యాల జిల్లా నేటి ముఖ్యాంశాలు

☞ శ్రీశైలానికి ఎంపీ శబరి పాదయాత్ర
☞ గడివేముల మండలంలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
☞ నెల్లూరు జిల్లాలో మంత్రి బీసీ పర్యటన
☞నంద్యాలలో ర్యాలీని జయప్రదం చేయండి: బొజ్జా
☞ చెంచు మహిళలకు కుట్టు మెషీన్లు పంపిణీ
☞ శ్రీశైలంలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
☞ ప్రొద్దుటూరులో ట్రాక్టర్ బోల్తా.. ఆళ్లగడ్డ డ్రైవర్ మృతి
☞ ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు: కర్నూలు కలెక్టర్
Similar News
News December 6, 2025
కామారెడ్డి: హోంగార్డుల సేవలు ఆదర్శం: ఎస్పీ

హోంగార్డులు అందిస్తున్న సేవలు ఎంతో ఆదర్శమని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శనివారం హోంగార్డుల దినోత్సవ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులతో సమానంగా హోంగార్డులు ప్రజాసేవ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పరంగా వారికి అందాల్సిర సంక్షేమ పథకాలు సకాలంలో అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
News December 6, 2025
బిగ్బాస్-9: రీతూచౌదరి ఎలిమినేట్?

తెలుగు బిగ్బాస్ సీజన్-9 రసవత్తరంగా మారింది. ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. నామినేషన్లలో ఆరుగురు ఉండగా నలుగురు సేవ్ అయ్యారు. చివరికి సుమన్ శెట్టి, రీతూ చౌదరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే అంతా సుమనే ఎలిమినేట్ అవుతారని భావించగా తక్కువ ఓటింగ్ రావడంతో అనూహ్యంగా రీతూ బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. రేపు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్తో క్లారిటీ రానుంది.
News December 6, 2025
మూతపడిన రామగుండం థర్మల్ స్టేషన్

TG: రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ మూతపడింది. 1971 అక్టోబర్లో USAID సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్ 18743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ప్లాంట్ జీవితకాలం ముగిసిందని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరువు ప్రభావిత జిల్లాల్లో వ్యవసాయ పంపు సెట్లకు ఈ యూనిట్ నుంచే విద్యుత్ సరఫరా చేశారు.


