News February 26, 2026

నంద్యాల జిల్లా నేతలకు మంత్రి లోకేశ్ విందు

image

ఉండవల్లి నివాసంలో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ కూటమి ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరితో పాటు డోన్, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, నంద్యాల, నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించిన అనంతరం, మంత్రి వారికి మంగళగిరి పట్టుచీరలను బహూకరించారు. అందరూ కలిసి మంత్రి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

Similar News

News April 19, 2026

అనంత: పెరుగుతున్న చీనీ ధరలు.. రైతుల హర్షం

image

అనంతపురం మార్కెట్ యార్డులో చీనీకాయల ధరలు కొన్ని రోజులుగా పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో శుక్రవారం 1,135 టన్నుల చీనీకాయలను టన్ను గరిష్ఠ ధర రూ.28 వేలకు రైతులు విక్రయించారు. మధ్యస్థం రూ.18 వేలు, కనిష్ఠం రూ.10 వేలు చొప్పున అమ్మారు. శనివారం రూ.29 వేలకు విక్రయాలు జరిగాయని యార్డు ఎంపికశ్రేణి ఇన్‌ఛార్జ్ కార్యదర్శి, ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలిపారు.

News April 19, 2026

అనకాపల్లి: చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు

image

సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణా అధికారిణి(ఆర్టీసీ) వి. ప్రవీణ తెలిపారు. డిపో నుంచి ఈనెల 20న తెల్లవారుజామున మూడు గంటల నుంచి 15 బస్సులు నడుపుతామన్నారు. ఈ బస్సులు రాత్రి వరకు తిరుగుతాయన్నారు.

News April 19, 2026

అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

image

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.