News March 30, 2025
నంద్యాల జిల్లా ప్రజలకు శుభవార్త

నంద్యాల జిల్లా ప్రజలకు పౌరసరఫరాల శాఖ అధికారులు శుభవార్త తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో కీలకమైన రేషన్ కార్డు లబ్ధిదారుల ఈకేవైసీ గడువును ఏప్రిల్-30 వరకు పొడిగించినట్లు ఆశాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల జిల్లావ్యాప్తంగా 15,17,936 రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండగా 13,57,936 మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 1.60 లక్షల మంది ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News November 5, 2025
కొత్తగూడెం: సింగరేణిలో పలువురు అధికారుల బదిలీ

సింగరేణిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జైపూర్‌లోని ఎస్టీపీపీ డీజీఎం ఉమాకాంత్ కార్పొరేట్‌కు, ఈఈ స్వీకర్ శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌కు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈఈ రాకేష్ ఎస్టీపీపీకి, ఆర్కే ఓసీ ఈఈ అనుదీప్ కేకే ఓసీకి, జేఈ శ్రీనివాసరావును కొత్తగూడెంకు, మందమర్రి డీవైపీఎం ఆసిఫ్‌ను ఆర్జీ 3కి, శ్రీరాంపూర్ సీనియర్ పీఓ కాంతారావును కార్పోరేట్‌కు బదిలీ చేశారు.
News November 5, 2025
‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత.. నేడు ఉత్తర్వులు

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేసే ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేశ్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చేసిన చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. తాజా నిర్ణయంతో పంచాయతీ, MPTC, ZPTC, పురపాలక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారూ పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది.
News November 5, 2025
సింగరేణిలో పలువురు అధికారుల బదిలీ

సింగరేణిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జైపూర్‌లోని NTPC డీజీఎం ఉమాకాంత్ కార్పొరేట్‌కు, ఈఈ స్వీకర్ శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌కు బదిలీ అయ్యారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈఈ రాకేష్ ఎస్టీపీపీకి, ఆర్కే ఓసీ ఈఈ అనుదీప్ కేకే ఓసీకి, జేఈ శ్రీనివాసరావును కొత్తగూడెంకు, మందమర్రి డీవైపీఎం ఆసిఫ్‌ను ఆర్జీ 3కి, శ్రీరాంపూర్ సీనియర్ పీఓ కాంతారావును కార్పొరేట్‌కు ట్రాన్ఫర్ చేశారు.


