News November 23, 2024

నంద్యాల జిల్లా యువకుడికి 18వ ర్యాంక్

image

నంద్యాల జిల్లా యువకుడు ఆల్ ఇండియా ర్యాంక్‌తో సత్తా చాటాడు. దొర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామనికి చెందిన గడ్డిపాటి నాగరాజు కుమారుడు యశ్వంత్ కుమార్ చెన్నైలోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్‌(IES) పరీక్ష రాశారు. ఇండియాలోనే 18వ ర్యాంక్ సాధించారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

Similar News

News December 14, 2024

KNL: నేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు

image

కర్నూలు జిల్లాలో నేడు సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేసీ కెనాల్, SRBC, తెలుగు గంగ, మైనర్ ఇరిగేషన్, మైలవరం పరిధిలోని ఆయకట్టు రైతులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సుమారు 3లక్షల మంది రైతులు నేడు ఓటేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. పలు చోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

News December 14, 2024

అల్లు అర్జున్ అరెస్ట్.. స్పందించని శిల్పా రవి!

image

తన మిత్రుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంకా స్పందించలేదు. నిన్న మధ్యాహ్నం బన్నీ అరెస్ట్ కాగా శిల్పా రవి ఇంకా స్పందించకపోవడంతో ఫ్యాన్స్ విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే శిల్ప రవి నిన్న నంద్యాలలో జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో అల్లు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News December 14, 2024

నంద్యాల కేసులో ఊరట! కానీ..

image

తనపై నంద్యాలలో నమోదైన కేసులో ఉపశమనం పొందిన హీరో అల్లు అర్జున్ మరో కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల వేళ బన్నీపై నంద్యాలలో కేసు నమోదు కాగా ఇటీవలే ఏపీ HC కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే పుష్ప-2 ప్రీమియర్ షో వీక్షించేందుకు HYDలోని సంధ్య థియేటర్‌కు బన్నీ రాగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. మహిళ మృతి చెందడంతో నమోదైన కేసులో ఆయన ఒకరోజు జైలులో గడపాల్సి వచ్చింది.