News May 21, 2024
నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసుల కార్డెన్ సర్చ్ ఆపరేషన్
నంద్యాల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో కౌంటింగ్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజకీయ నాయకులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ప్రజలకు వివరిస్తున్నారు. రౌడీ షీటర్లను, నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు.
Similar News
News October 11, 2024
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 13 నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
News October 11, 2024
ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: నంద్యాల ఎస్పీ
నంద్యాల జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు, పోలీసులు సంతోషంగా జీవించాలని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందేలా విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆకాంక్షించారు.
News October 11, 2024
ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: కలెక్టర్
ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో-భేటి పడావో కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తోందన్నారు. ఆడపిల్లలను మంచి చదువులు చదివించాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు.