News February 22, 2025
నంద్యాల జిల్లా TODAY TOP NEWS..!

☞ భూ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడాలి: ఆర్డీఓ విశ్వనాథ్ ☞ గోర్విమానుపల్లెలో టికెట్లు తనిఖీ చేసిన ఆళ్లగడ్డ డీఎస్పీ ☞ ఆకట్టుకుంటున్న అవుకు రిజర్వాయర్ అందాలు ☞ మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి తరఫున పట్టు వస్త్రాలు ☞ శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ వద్ద ప్రమాదం ☞ విద్యార్థినుల అశ్లీల చిత్రాల వ్యాపారంలో నిందితుల అరెస్ట్ ☞ జిల్లాలోని అన్ని మండలాల్లో ఉయ్యాలవాడ వర్ధంతి వేడుకలు
Similar News
News December 10, 2025
పల్నాడు: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు.?

టీడీపీ నేతల జంట హత్య కేసులో నిందితులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (ఏ7) గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం. రెండు వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
News December 10, 2025
పోలింగ్కు కట్టుదిట్టమైన బందోబస్త్: రామగుండం సీపీ

మొదటి విడత పంచాయితీ పోలింగ్కు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు, గొడవలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.
News December 10, 2025
VJA: భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లపై ఇన్ఛార్జ్ కలెక్టర్ సమీక్ష

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమ ఏర్పాట్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా బుధవారం పరిశీలించారు. దాదాపు 6 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసినట్లు తెలిపారు. భక్తుల భద్రత, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఆర్డీవో, ఈవో, పోలీసు అధికారులతో కలిసి ఆమె క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.


