News March 12, 2025

నంద్యాల జిల్లా TODAY TOP NEWS.!

image

☞ జిల్లాకు చెందిన పదవ తరగతి ప్రశ్న పత్రాలు☞ గాజులపల్లె మెట్ట వద్ద డ్రైనేజ్ కాలువ దుర్గంధం☞ జొన్నకు మద్దతు ధర కల్పించండి: మంత్రులు☞ పాండవగల్లులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం☞ మంత్రి బీసీపై విమర్శలు తగవు: టీడీపీ నేతలు☞ పదవ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం☞ TDP MLC అభ్యర్థి బీటీ నాయుడు ఆస్తులు రూ.5.68 కోట్లు ☞ పోసాని కేసు.. ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్

Similar News

News December 6, 2025

కృష్ణా: స్క్రబ్ టైఫస్ లక్షణాలతో వ్యక్తి మృతి

image

పెనమలూరు పరిధిలోని ముద్దునూరులో 44 ఏళ్ల శివశంకర్ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందారు. ఈ నెల 2న వైద్య పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. 4న ఆయన చనిపోగా, ఇవాళ రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే నిర్వహిస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 4, ఎన్టీఆర్ జిల్లాలో 2 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

News December 6, 2025

కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖ్యలపై విమర్శలు

image

రూపాయి విలువ పతనంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన <<18486026>>వ్యాఖ్యలు<<>> విమర్శలకు దారి తీస్తున్నాయి. రూపాయి తన స్థాయిని కనుగొనడం అంటే డాలర్‌కు 100 రూపాయలు దాటడమా అని సెటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేసి, అధికారంలో ఉన్నప్పుడు సమస్యను చిన్నదిగా చూపడం సరికాదని దుయ్యబడుతున్నారు. ఏమైనప్పటికీ చివరికి ధరలు పెంచి సామాన్యుడినే దోచుకుంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మీరేమంటారు?

News December 6, 2025

SRCL: పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవికుమార్ శనివారం పరిశీలించారు. వేములవాడ అర్బన్ పరిధిలోని చీర్లవంచ, మారుపాక, చింతలతాన, కోనరావుపేట మండలం కొలనూరు, మర్తనపేటలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.