News April 15, 2025

నంద్యాల జిల్లా TODAY TOP NEWS.!

image

☞ఉమ్మడి కర్నూలు జిల్లాలో 240 టీచర్ పోస్టులు.!
☞ఆలమూరులో గ్యాస్ లీకేజ్.. తప్పిన పెను ప్రమాదం
☞బనగానపల్లెలో మహిళ ఆత్మహత్య
☞ మహానందిలో మిస్టరీగానే వ్యక్తి మరణం
☞ఆళ్లగడ్డలో టీడీపీ నేతపై దుండగుల దాడి.

NOTE: పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘v’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.

Similar News

News December 8, 2025

ఏలూరు: PGRSకు 363 ఫిర్యాదులు- JC

image

ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి PGRS కార్యక్రమంలో మొత్తం 363 ఫిర్యాదులు స్వీకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ సోమవారం తెలిపారు. ఆయా శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి, నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని JC సూచించారు.

News December 8, 2025

భద్రాచలం: అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలి: ఎస్పీ

image

భద్రాచలం బ్రిడ్జి వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన SST (స్టాటిక్ సర్వేలైన్స్ టీం) చెక్ పోస్ట్‌ను ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ పూర్తయ్యే వరకు చెక్ పోస్టుల వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు.

News December 8, 2025

రాయికల్: ‘ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి అన్నారు. రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు అవసరమైన సామగ్రిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి తిరిగి వాటిని స్ట్రాంగ్ రూములకు చేర్చడం వరకు ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.