News July 25, 2024
నంద్యాల జేసీగా విష్ణు చరణ్ బాధ్యతలు

నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా 2019 బ్యాచ్ IAS అధికారి సి.విష్ణు చరణ్ కలెక్టరేట్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత కలెక్టరేట్ చేరుకున్న నూతన జేసీ విష్ణు చరణ్కు డీఆర్ఓ పద్మజ స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని JC తెలిపారు.
Similar News
News December 20, 2025
క్రిస్మస్, న్యూ ఇయర్.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని SP విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గిఫ్ట్ కార్డు లింకులతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే 1930, 100, 102కు కాల్ చేయాలన్నారు.
News December 19, 2025
కర్నూలు పోలీసులకు ప్రతిష్ఠాత్మక ABCD అవార్డు

ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ATM దొంగతనం కేసును సమర్థవంతంగా ఛేదించినందుకు కర్నూలు జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయి అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ABCD) లభించింది. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అవార్డును అందుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను డీజీపీ అభినందించారు.
News December 19, 2025
చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్తారు: ఎస్వీ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రజలకు ఒక్క హామీ కూడా అమలు కాలేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. లేకపోతే ప్రజలు మరొకసారి గుణపాఠం చెప్తారని అన్నారు. పేదల హక్కుల కోసం చివరి వరకు జగన్ పోరాడుతారని అన్నారు.


