News October 6, 2024

నంద్యాల: టైరు పేలి గ్యాస్ సిలిండర్ల ఆటో బోల్తా

image

బనగానపల్లె మండలం యనకండ్ల సమీపంలో ఆదివారం ఉదయం గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో టైర్ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. బనగానపల్లె నుంచి యనకండ్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు పేలి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని పేర్కొన్నారు.

Similar News

News November 5, 2024

కర్నూలు: 18 వరకు టెన్త్ ఫీజు చెల్లింపు గడువు: డీఈవో

image

ఈనెల 18వ తేదీ వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుంతో 25వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 3వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 4, 2024

ఈనెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీశైలం పర్యటన..!

image

ఈనెల 9న రాష్ట్ర సీఎం శ్రీశైలం పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. విజయవాడ- శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పర్యాటక, రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ, జలవనరులు, మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.

News November 4, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 88 ఫిర్యాదులు: ఎస్పీ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని ఎస్పీ బిందు మాధవ్ పోలీసులను ఆదేశించారు. సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 88 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం చేయరాదన్నారు.