News October 4, 2024

నంద్యాల: ‘డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తాం’

image

నంద్యాల నందమూరి నగర్‌కు చెందిన మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యారు. డెలివరీ అయిన 8 రోజులకు ఆరోగ్యం సరిగాలేక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు 14 రోజులు ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందించారు. అయితే ఆ మహిళ మృతి చెందారు. వైద్య సేవలకు రూ.3.30 లక్షల బిల్లు అయింది. డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో ఆసుపత్రి ఎదుట బాధితులు నిరసన చేపట్టారు.

Similar News

News November 22, 2025

రైతులకు సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్

image

రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ చేసే విధంగా కలెక్టర్ ట్రేడర్లతో శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ, సాగు చేసిన పంటలకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News November 22, 2025

వెయిట్ లిఫ్టర్లను అభినందించిన కలెక్టర్

image

ఈ నెల 14 నుంచి 16 వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, సీనియర్ ఉమెన్, మెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు లిఫ్టర్లు పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వీరేశ్, ముషరాఫ్, పర్వేజ్, చాంద్ బాషా, హజరత్ వలిని కలెక్టర్ డా.సిరి శనివారం అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి వెయిట్ పోటీల్లోనూ ఇదే ప్రతిభ కనబరచాలన్నారు. కోచ్ యూసుఫ్ పాల్గొన్నారు.

News November 22, 2025

ఏపీ కుర్ని కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్‌గా ఎమ్మిగనూరు నేత

image

కూటమి ప్రభుత్వం మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మిగనూరుకు చెందిన టీడీపీ నేత మిన్నప్పకు కుర్ని కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. మిన్నప్ప మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆశీర్వాదంతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. బీవీకి, సీఎం చంద్రబాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.