News July 15, 2024

నంద్యాల: దారుణం.. చెల్లిపై అత్యాచారం

image

చెల్లిపై అత్యాచారాని పాల్పడిన ఘటన అలస్యంగా వెలుగుచూసింది. DSP శ్రీనివాస్ వివరాలు..డోన్‌కు చెందిన కేశవులు ఉమ్మడి మహబూబ్‌నగర్(D) బిజినేపల్లి(M) కూలి పనికి వెళ్లాడు. వండి పెట్టేందుకు వెళ్లిన చెల్లిపై కేశవులు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లికి తెలియడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బలాన్‌పల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కేశవులుని పోలీసులు విచారించగా విషయం బయటపడింది. కేశవులును రిమాండ్‌ తరలించారు.

Similar News

News November 10, 2025

కర్నూలు: డయల్ యువర్ APSPDCL సీఎండీ

image

ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ APSPDCL సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా కర్నూల్, నంద్యాల జిల్లాలలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చన్నారు. 8977716661 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

News November 10, 2025

కర్నూలు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు: ఎస్పీ

image

కర్నూలు జిల్లాలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం జిల్లాలో నేర నియంత్రణకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు, తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

News November 9, 2025

కర్నూలులో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

కర్నూలులోని నిర్మల్ నగర్‌‌లో ఆదివారం విషాదం నెలకొంది. కాలనీకి చెందిన భరత్ కుమార్(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే సెమిస్టర్ పరీక్షలు రానున్నాయనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.