News March 1, 2025

నంద్యాల నగరంలో భారీ ర్యాలీ

image

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

Similar News

News November 12, 2025

అల్లూరి జిల్లాలో 11,598 గృహాలు ప్రారంభం

image

అల్లూరి జిల్లాలో నేడు 11,598 గృహాల ప్రారంభోత్సవాలు జరగనున్నాయని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పాడేరు నియోజకవర్గంలో సప్పిపుట్టు, అరకు నియోజకవర్గంలో సిమిలిగూడ, రంపచోడవరం నియోజకవర్గంలో అడ్డతీగలలో నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని, తగిన ఏర్పాట్లు చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News November 12, 2025

సిద్దిపేట జిల్లాలో ఏసీబీ రైడ్స్!

image

సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఏసీబీ రైడ్స్ జరిగాయి. రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ విజయ్ కుమార్, కానిస్టేబుల్ రాజు ఏసీబీకి చిక్కారు. ఎస్ఐ, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీస్ స్టేషన్‌లో విచారణ జరిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 12, 2025

నేడు మేడారానికి నలుగురు మంత్రులు

image

ములుగు జిల్లా మేడారంలో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. రానున్న మహా జాతర నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు పరిశీలిస్తారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకుని, 12 గంటలకు అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.