News March 1, 2025

నంద్యాల నగరంలో భారీ ర్యాలీ

image

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

Similar News

News March 19, 2025

భూపాలపల్లి: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం: డీఎంహెచ్‌వో

image

లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరమని పరీక్ష చేయించిన వారు, చేసిన వారు, ప్రోత్సహించిన వారు, శిక్షార్హులు అవుతారని డీఎంహెచ్‌వో డా.మధుసూదన్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 94405 86982 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు. వైద్యులు పాల్గొన్నారు.

News March 19, 2025

ఫ్యామిలీ రూల్ పాలసీ మారదు: BCCI సెక్రటరీ

image

విదేశీ పర్యటనల ఫ్యామిలీ రూల్స్‌పై <<15777927>>కోహ్లీ<<>> వ్యాఖ్యలకు BCCI సెక్రటరీ సైకియా కౌంటర్ ఇచ్చారు. ఈ రూల్స్‌ను సమీప భవిష్యత్తులో మార్చబోమన్నారు. ‘దీనిపై కొందరికి ఆగ్రహం, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాత్రికి రాత్రే ఈ విధానం తేలేదు. పాత నిబంధనలకే సవరణ చేశాం. ప్రాక్టీస్ సెషన్లలో ఆటగాళ్ల హాజరు, మ్యాచ్ షెడ్యూల్‌లు, పర్యటనలు తదితర నిబంధనలున్నాయి. ఇవి జట్టు సమన్వయం, ఐక్యత కోసం తీసుకున్న నిర్ణయాలు’ అని తెలిపారు.

News March 19, 2025

తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను బడ్జెట్ ప్రతిబింబించింది: మంత్రి సురేఖ

image

రాష్ట్ర బ‌డ్జెట్ మీద మంత్రి కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను రాష్ట్ర రెండో బ‌డ్జెట్‌ ప్రతిబింబించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క నేతృత్వంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల అవసరాలను గుర్తించి త‌గిన మేర‌కు కేటాయింపులు చేయ‌డం హ‌ర్ష‌ణీయం అని మంత్రి అన్నారు.

error: Content is protected !!