News March 24, 2025
‘నంద్యాల నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి’

నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.
Similar News
News December 16, 2025
IDPL ల్యాండ్స్ వివాదంపై సర్కారు విచారణకు ఆదేశం

IDPL ల్యాండ్స్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ వివాదంలో తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ సర్వే నెంబర్ 376లో జరిగిన భూవివాదాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
News December 16, 2025
కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలి. తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా అది ఉండాలి. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. అందువల్లనే పరకామణి ఘటన జరిగింది’ అని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించింది.
News December 16, 2025
పాలకుర్తి: తండా సర్పంచ్‌గా 22 ఏళ్ల యువతి

పాలకుర్తి మండలం బామ్లనాయక్ తండా గ్రామ సర్పంచిగా 22ఏళ్ల ఇస్లావత్ అఖిల ఎన్నికయ్యారు. కరీంనగర్ మహిళా డిగ్రీ కాలేజీలో బీఏ సెకండరీ పరీక్షలు రాస్తున్న ఆమె ఇటీవల GP ఎన్నికల బరిలో నిలిచారు. ప్రత్యర్థి లక్ష్మిపై 200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో తండాలో విజయోత్సవాలు నిర్వహించారు. గ్రామ సమస్యలపై తనకు అవగాహన ఉందని, ప్రభుత్వ సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అఖిల పేర్కొన్నారు.


