News April 10, 2025
నంద్యాల: పండ్లు మాగించడంపై అవగాహన

అనుమతులున్న పౌడర్లు మాత్రమే వాడి మామిడి పండ్లను మాగించాలని జిల్లా అధికారులు అన్నారు. అందుకు ఏసీ గోడౌన్లను ఉపయోగించుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి నాగరాజు, మార్కెటింగ్ ఏడీఎస్ అబ్దుల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓ. వెంకట రాముడు, కాసింలు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో నిషేధిత క్యాల్షియం కార్బైడ్ వినియోగంపై బుధవారం పండ్ల వ్యాపారస్తులకు తెలిపారు.
Similar News
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. రూ.వందల కోట్ల ఖర్చు!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీలు రూ.వందల కోట్లు కుమ్మరిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఓటుకు రూ.1500-2500 వరకు ఇస్తున్నాయని టాక్. ఇక్కడ మొత్తం 4 లక్షలకు పైగా ఓట్లున్నాయి. అందులో కనీసం 3 లక్షల మందికి రూ.2500 చొప్పున పంపిణీ చేసినా రూ.75Cr ఖర్చవుతుంది. ఇక ప్రచారానికి జన సమీకరణ, యాడ్స్కు అదనం. దీంతో ఒక్కో అభ్యర్థి రూ.100 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. రేపు పోలింగ్ జరగనుంది.
News November 10, 2025
ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ధాన్యాన్ని పరిశుభ్రమైన, పొడి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. సంచులు గోడల నుంచి నేల నుంచి తేమ పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి. ధాన్యాన్ని 1-2 అడుగుల ఎత్తు గల దిమ్మల మీద గాని బెంచీల మీద గాని పెడితే నేలలో తేమను సంచులు పీల్చుకోవు. కీటకాల నుంచి ధాన్యం రక్షణకు నిపుణుల సూచన మేరకు అప్పుడప్పుడు పొగబెట్టడం మంచిది. ఎలుకల కట్టడి ముఖ్యం. లేకుంటే ఇవి ధాన్యాన్ని తినేస్తూ వాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం చేస్తాయి.
News November 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 62

ఈరోజు ప్రశ్న: భీష్ముడు చనిపోవడానికి కారణమైన శిఖండి ఎవరు? ఆమె ఎందుకు అతని పతనాన్ని కోరుకుంది?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


