News March 23, 2024

నంద్యాల: పరీక్షా కేంద్రం వద్ద గుండెపోటుతో ఇన్విజిలేటర్ మృతి

image

బనగానపల్లెలో శనివారం విషాదం చోటుచేసుకుంది.
పదవ తరగతి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌ గా విధులు నిర్వహిస్తున్న షాషావలి(55) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతిచెందారు. పరీక్షా కేంద్రంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చి ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలారు. స్థానికులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Similar News

News January 4, 2026

కర్నూలులో కడుపుబ్బా నవ్వించిన జబర్దస్త్ టీమ్

image

కర్నూలులో జబర్దస్త్ టీమ్ కడుపుబ్బ నవ్వించారు. ఆదివారం టీజీవి కళాక్షేత్రంలో 2026 సంవత్సరం మొదటి ప్రదర్శనగా జబర్దస్త్ కామెడీ షోను ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, విద్యావేత్తలు కేవీఎన్ రాజశేఖర్, పుల్లయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంవత్సరం మొత్తం శ్రోతలకు ఆనందం, వినోదం అందించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.

News January 4, 2026

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది: మంత్రి

image

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్లు మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. ఆదివారం లూయిస్ బ్రెయిలీ 217వ జయంతిని పురస్కరించుకుని క‌ర్నూల్లోని బి.క్యాంపులో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే గౌరు చ‌రితతో క‌లిసి ఆయ‌న పాల్గొన్నారు. ఇంద్రధనస్సు లాంటి 7 వరాలను ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగుల కోసం ప్రకటించారన్నారు.

News January 4, 2026

శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో సినీ డైరెక్టర్

image

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని సినిమా డైరెక్టర్ తేజ, టీడీపీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్క రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంచాలమ్మ దేవి, మూల బృందావనాన్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీమఠం అధికారులు నరసింహమూర్తి, వ్యాసరాజస్వామి, పన్నగ వెంకటస్వామి పాల్గొన్నారు.