News March 23, 2024
నంద్యాల: పరీక్షా కేంద్రం వద్ద గుండెపోటుతో ఇన్విజిలేటర్ మృతి
బనగానపల్లెలో శనివారం విషాదం చోటుచేసుకుంది.
పదవ తరగతి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహిస్తున్న షాషావలి(55) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతిచెందారు. పరీక్షా కేంద్రంలో ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చి ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలారు. స్థానికులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Similar News
News September 14, 2024
కర్నూలు: 16న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు
ఈ నెల 16న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం ఓ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం, డివిజన్ స్థాయి, మున్సిపాలిటీ, మండల స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News September 14, 2024
కొండారెడ్డి బురుజుకు ఆ పేరెలా వచ్చింది?
కర్నూలులోని కొండారెడ్డి బురుజును క్రీ.శ 16వ శతాబ్దంలో అచ్యుతదేవరాయులు నిర్మించారు. 1602-1618 మధ్య అబ్దుల్ వహాబ్ కందనవోలును పరిపాలించే వారు. ఆ సమయంలో నందికొట్కూరు తాలుకాలోని పాతకోట పాలెగాడైన కొండారెడ్డి అతని అధికారాన్ని ధిక్కరించారట. దీంతో వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించాడు. అందులోనే మరణించడంతో అతని పేరుమీద దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.
News September 14, 2024
చంద్రబాబును గిన్నిస్ బుక్‌కు ఎక్కించాలి: ఎస్వీ మోహన్ రెడ్డి
సీఎం చంద్రబాబుపై కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి NMC మంజూరు చేసినా సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబును గిన్నిస్ బుక్‌కు ఎక్కించాలని విమర్శించారు. పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కలలపై CBN నీళ్లు చల్లారని ఎస్వీ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.