News September 24, 2024
నంద్యాల: పీజీఆర్‌ఎస్‌కు 135 ఫిర్యాదులు
నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 135 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై అధికారులు చొరవచూపి పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా ప్రతి పోలీస్ అధికారి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు పాల్గొన్నారు.
Similar News
News October 7, 2024
అలంపూర్ మా అమ్మమ్మగారి ఊరు: కర్నూలు కలెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ జోగులాంబ శ్రీబాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు ఆదివారం కర్నూలు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంపూర్ తన అమ్మమ్మగారి ఊరని, సెలవుల్లో ఇక్కడికి వచ్చి గడిపే వాళ్ళమని. అలంపూర్‌తో తనకున్న జ్ఞాపకాలను కలెక్టర్ నెమరేసుకున్నారు.
News October 7, 2024
శ్రీశైల మల్లన్న క్షేత్రం.. పుష్ప శోభితం!
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉభయ ఆలయాల ప్రధాన ధ్వజస్తంభాలు, ఉపాలయాలను, ముఖద్వారా లను వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన రకరకాల పూలతో స్వామి అమ్మవార్ల ప్రతిబింబాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పుష్పాలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
News October 6, 2024
కర్నూలు: టెట్ పరీక్షకు 256 మంది గైర్హాజరు
కర్నూలు జిల్లాలో ఆదివారం టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ వెల్లడించారు. పరీక్షకు మొత్తం 2,435 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 256 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. టెట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినట్లు తెలిపారు.