News August 16, 2024

నంద్యాల పూర్వ కలెక్టర్‌కు ఫైన్..ఎందుకంటే..?

image

నంద్యాల పూర్వ కలెక్టర్‌కు హైకోర్టు రూ.10 వేల ఫైన్ వేసింది. లైమ్‌స్టోన్ భూములను కాటసాని రామిరెడ్డి అనుచరులకు అసైన్డ్ చేసేందుకు సిఫార్సు చేశారని మంత్రి బీసీ ఆరోపించారు.ఈ ప్రక్రియను నిలిపివేయాలని 2023లో హైకోర్టులో ఫిల్ వేశారు. దీనిపై కౌంటర్ వేయాలని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి, కలెక్టర్‌కు కోర్టు ఆదేశించినా వేయలేదు. బుధవారం వెలువరించిన తీర్పులో గనుల శాఖ కార్యదర్శికి కూడా రూ.20వేలు ఖర్చులు విధించింది.

Similar News

News November 11, 2025

గవర్నర్ కర్నూలు పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ కర్నూలు పర్యటన ఖరారయింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12న కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం నగరంలోని మాంటిస్సోరి విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆయన రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌తో కలిసి పాల్గొననున్నారు.

News November 11, 2025

తెలంగాణలో యాక్సిడెంట్.. కర్నూలు వాసి మృతి

image

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలులోని ఆర్ఆర్ నగర్‌కు చెందిన ఎన్. రఘు(43) మృతి చెందారు. చిలుకూరు మిట్స్ కాలేజీ సమీప హైవేపై సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సత్తుపల్లికి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, కోదాడ నుంచి హుజూర్నగర్ వెళ్తున్న బొలెరో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ రఘు మృతి చెందగా, పలువురు గాయాలపాలయ్యారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

News November 11, 2025

ఢిల్లీలో పేలుడు.. అప్రమత్తమైన కర్నూలు పోలీసులు

image

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కర్నూల్ వ్యాప్తంగా అప్రమత్తతా చర్యలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కర్నూలు, గుత్తి పరిధిలోని పెట్రోల్ బంకులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు.