News March 17, 2025
నంద్యాల: పోలీసుల గ్రీవెన్స్ డేకు 72 అర్జీల రాక

నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే జరిగింది. మొత్తం 72 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులను విచారించి చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా.. త్వరగా పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
Similar News
News November 27, 2025
శ్రీకాకుళం: యాక్సిడెంట్..మృతుల వివరాలు ఇవే.!

పలాస మండలం గరుడఖండి గ్రామ సమీప పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు <<18406276>>మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. మృతులు పాతపట్నం మండలం సరళి గ్రామానికి చెందిన తలగాపు భీమారావు, తలకాపు వేణుగా పోలీసు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన యువకుడు సుశాంత్ (23) ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్ ద్రమగిరి బ్లాక్ డేరా గ్రామానికి చెందిన యువకుడు అని తెలిపారు.
News November 27, 2025
NZB: 34 మందికి రూ.3.35 లక్షల జరిమానా

నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 34 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారికి రూ.3.35 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
News November 27, 2025
కృష్ణా: సొంతిల్లు లేదా.. మూడు రోజులే గడువు త్వరపడండి.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇల్లులేని 22,694 కుటుంబాలకు (NTRలో 15,994, కృష్ణాలో 6,700) PM AWAS+ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం ఇంటి నిర్మాణానికి రూ.1.59 లక్షలు ఇస్తోంది. మొత్తం రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు సాయం అందనుంది. అర్హత ఉన్న పేదలు తమ వివరాలను సచివాలయాల్లో నమోదు చేసుకోవడానికి NOV 30వ తేదీ చివరి గడువని అధికారులు స్పష్టం చేశారు.


