News January 29, 2025

నంద్యాల ప్రజలకు SP కీలక ఆదేశాలు

image

అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌ను లిఫ్ట్ చేయకూడదని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ ద్వారా పలు ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా మిమల్ని ట్రాప్ చేసి బెదిరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటివి ఎదుర్కొంటే భయపడకుండా 1930కు ఫిర్యాదు చేయాలని SP సూచించారు. 

Similar News

News November 18, 2025

సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

image

సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ కిరణ్ పట్టుబడ్డాడు. ఎమ్మార్వో కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సర్వేయర్ కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 18, 2025

సాంఘిక దురాచారాలపై పోరాటం అవసరం: చిన్నారెడ్డి

image

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఈ ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్ష కొనసాగడం బాధాకరమని సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి జి. చిన్నారెడ్డి అన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడారు.

News November 18, 2025

వైద్య అధికారులకు పల్నాడు కలెక్టర్ ఆదేశాలు

image

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించిన అన్ని బకాయిలను 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల వైద్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో ఉన్న సౌకర్యాల స్థాయిని, నిధుల ఉత్పత్తిని కలెక్టర్ సమీక్షించారు.