News January 29, 2025

నంద్యాల ప్రజలకు SP కీలక ఆదేశాలు

image

అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌ను లిఫ్ట్ చేయకూడదని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ ద్వారా పలు ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా మిమల్ని ట్రాప్ చేసి బెదిరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటివి ఎదుర్కొంటే భయపడకుండా 1930కు ఫిర్యాదు చేయాలని SP సూచించారు. 

Similar News

News February 7, 2025

పొందూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

పొందూరులో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల అందించిన సమాచారంతో ఏస్.ఐ మధుసూదన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు (45)ఏళ్ల వయసు ఉంటుందన్నారు. బిస్కెట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ షార్ట్ ఉందని వివరాలు తెలిస్తే 94934 74582 నంబరును సంప్రదించాలని కోరారు.

News February 7, 2025

విశాఖ మీదుగా వెళ్లే యశ్వంత్పూర్ రైలు రద్దు

image

టాటా నగర్ నుంచి విశాఖ మీదగా యశ్వంత్పూర్ వెళ్లే రైలును(18111/12) ఫిబ్రవరి 6,13 తేదీలలో రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఖమ్మం డివిజన్‌లో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడం వలన రైలును రద్దు చేసినట్లు తెలిపారు. యశ్వంత్పూర్ నుంచి విశాఖ మీదగా టాటానగర్ వెళ్లే రైలు కూడా ఫిబ్రవరి 6,13 తేదీలలో రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News February 7, 2025

ఇక‌పై ఫోన్‌లోనే అన్ని ధ్రువపత్రాలు: భాస్కర్

image

AP: రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్‌పై IT శాఖ కార్యదర్శి భాస్కర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘ఇకపై అన్ని ధ్రువపత్రాలు ఫోన్‌లోనే జారీ చేస్తాం. ప్రతి పౌరుడికి DG లాకర్ సదుపాయం కల్పిస్తాం. అన్ని పత్రాలూ వాట్సాప్‌లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారానే అర్జీలు, ఫిర్యాదులు చేయొచ్చు. చదువురాని వాళ్లు వాయిస్ ద్వారా సంప్రదించవచ్చు. ప్రతిశాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమిస్తాం’ అని అన్నారు.

error: Content is protected !!