News March 20, 2024

నంద్యాల: ప్రతి చిన్న సంఘటనను వీడియోలు తీయాలి

image

భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్స్, వీడియో సర్వైలెన్స్ టీమ్స్ వీడియో గ్రాఫర్లు ఎన్నికలకు సంబంధించిన ప్రతి చిన్న ఘటనను వీడియోగ్రఫీ చేయాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో అన్ని టీమ్‌ల వీడియో గ్రాఫర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు.

Similar News

News January 9, 2026

పారిశుద్ధ్య పనులపై కలెక్టర్ ఆదేశాలు

image

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులు ప్రజలు సంతృప్తి చెందేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో రోజువారీ చెత్త సేకరణ జరగాలన్నారు. డ్రైన్లు, రోడ్లు, బహిరంగ ప్రదేశాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని, ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో డిప్యూటీ ఎంపీడీవోలు స్వయంగా పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

News January 9, 2026

1100కు ఫోన్ చేయవచ్చు: కలెక్టర్

image

అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. అలాగే అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్సైట్‌లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News January 9, 2026

శిథిలావస్థలో చరిత్ర గల శివాలయం

image

నందవరం మండలం రాయచోటిలో శ్రీకృష్ణదేవరాయల నాటి చరిత్ర కలిగిన శివాలయం ఉంది. ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. పలుమార్లు ఈ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు లంకె బిందెల కోసం తవ్వకాలు జరిపి, ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరిపినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామస్థులు, శివభక్తులు రెండేళ్లుగా ఆలయం పరిసరాలను శుభ్రం చేస్తూ కాపాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా రక్షణ కల్పించాలని కోరారు.